హలో నాని.. హూఈజ్ నాని..!
- November 15, 2018
సినిమాల్లో హీరోల డ్యూయల్ రోల్స్ చాలానే చూస్తుంటాం.. సాధారణంగా డ్యూయల్ రోల్ అంటే తండ్రి కొడుకులుగానే నటిస్తుంటారు హీరోలు. కానీ నిజజీవితంలో హీరో, తన కొడుకు సేమ్ టూ సేమ్ ఉంటే ఎలా ఉంటుంది. వారిని చూస్తుంటే అభిమానులకు కన్నుల పండువగా ఉంటుంది కదా..! ఇప్పుడు మన నేచురల్ స్టార్ నాని అలాంటి ఫోటోనే షేర్ చేశాడు.
నాని తన చిన్నతనంలో ఎలా ఉన్నాడో.. ఇప్పుడు తన కొడుకు అచ్చం అలాగే ఉన్నాడు. ఇలాంటి ఓ ఫోటోను బాలల దినోత్సవం సందర్భంగా నాని తన ట్విట్టర్ ఖాతాలో ఫోస్ట్ చేశాడు. తన చిన్నప్పటి ఫొటోతో పాటు తన కొడుకు అర్జున్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాని ‘మేమిద్దరం ఒకేలా ఉన్నాం.. నిజజీవితంలో డ్యూయల్ రోల్’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. నిజంగా ఇందులో నాని ఎవరు.. వాళ్ల బాబు అర్జున్ ఎవరో గుర్తుపట్టడం కష్టం. దీంతో ఈ ఫోటోను నెటిజన్లు రీట్వీట్ చేస్తూ ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







