ఫేస్ బుక్ లో మెసేజ్ 'అన్ సెండ్' ఫీచర్
- November 15, 2018ఫేస్ బుక్ కొంత కాలంగా తన మెసెంజర్ లో 'అన్ సెండ్' ఫీచర్ జోడించడం గురించి చెబుతోంది. ఇప్పుడు ఈ ఫీచర్ ను ఫేస్ బుక్ యూజర్ల అందుబాటులోకి తెచ్చింది. అన్ సెండ్ ఫీచర్ లో విశేషం ఏంటంటే యూజర్ తన చాట్ నుంచి పంపిన మెసేజ్ లను డిలిట్ చేయవచ్చు. మునుపు ఇలా చేసే వీలుండేది కాదు. మొదట యూజర్లు తమ మెసేజ్ లను డిలిట్ చేస్తే అది కేవలం వారి చాట్ బాక్స్ నుంచి మాత్రమే డిలిట్ అయ్యేది. కొత్త ఫీచర్ కారణంగా యూజర్లు మెసేజ్ డిలిట్ చేస్తే వారి చాట్ నుంచే కాకుండా మెసేజ్ పొందినవారి ఇన్ బాక్స్ నుంచి కూడా డిలిట్ అయిపోతుంది.
ఫేస్ బుక్ నుంచి పంపిన మెసేజ్ లను డిలిట్ చేయడానికి 10 నిమిషాల సమయం ఉంటుంది. అంటే యూజర్ ఒకరికి పంపాల్సిన మెసేజ్ మరొకరికి పంపితే దానిని 10 నిమిషాల్లోగా అన్ సెండ్ చేయవచ్చు. అన్ సెండ్ ఫీచర్ ద్వారా యూజర్లు చాట్ తో పాటు ఫోటోలు, వీడియోలను కూడా డిలిట్ చేయవచ్చు. భవిష్యత్తులో ఏదైనా వేధింపుల ఫిర్యాదు వస్తే అందజేసేందుకు వీలుగా ఫేస్ బుక్ అన్ సెండ్ చేసిన మెసేజ్ ల కాపీని కొంత కాలం పాటు తన దగ్గర ఉంచుతుంది.
ప్రస్తుతం ఫేస్ బుక్ ఈ ఫీచర్ ను బొలీవియా, పోలాండ్, కొలంబియా, లిథువేనియా వంటి దేశాల్లో అందుబాటులోకి తెచ్చింది. త్వరలోనే భారత్ తో సహా మిగతా దేశాలన్నిటిలో వాడుకలోకి తెచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఈ ఫీచర్ ను ఉపయోగించేందుకు యూజర్ తను పంపిన మెసేజ్ పై ట్యాప్ చేసి కొంతసేపు హోల్డ్ చేస్తే చాలు. వెంటనే Remove for everyone ఆప్షన్ వస్తుంది. దానిని ట్యాప్ చేస్తే యూజర్ తను పంపిన మెసేజ్ డిలిట్ అవుతుంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్