కువైట్‌లో వర్షాలు: యూఏఈ నుంచి విమానాల రద్దు
- November 15, 2018
యూఏఈకి చెందిన అన్ని ఎయిర్ లైన్స్, తమ విమానాల్ని కువైట్‌కి వెళ్ళకుండా నిలువరించాయి. కువైట్‌లో వున్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిజిసిఎ పేర్కొంది. కువైట్‌లో భారీ వర్షాలు, వరదలతో జన జీవనం అస్తవ్యస్తమవుతోంది. విమానాశ్రయాల్లోనూ వరద నీరు పోటెత్తుతోంది. దుబాయ్, అబుదాబీ సహా అనేక విమానాశ్రయాలనుంచి విమానాల్ని కువైట్‌కి నిలిపివేశారు. కువైట్‌లో స్కూళ్ళు సైతం మూతపడ్డాయి. గత ఐదు రోజులుగా అక్కడ ఇదే పరిస్థితి నెలకొంది. మరోపక్క కువైట్‌లో యూఏఈ ఎంబసీ, తమ పౌరుల్ని అప్రమత్తం చేసింది. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ప్రమాదకర ప్రాంతాలకు వెళ్ళరాదని పౌరుల్ని హెచ్చరించింది. కాగా, కువైట్ పెట్రోలియం కార్పొరేషన్, తమ కంపెనీల్లో వర్క్‌ని తాత్కాలికంగా నిలిపివేసింది. కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ కూడా వర్క్‌ని నిలిపివేయడం గమనార్హం. అనూహ్యంగా చోటు చేసుకున్న వరదలతో కువైట్‌లో పరిస్థితులు బీతావహంగా మారాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







