ప్రపంచంలోనే రెండు దిగ్గజ సంస్థల మధ్య జరుగుతున్న వార్
- November 15, 2018
కాలిఫోర్నియా: ప్రపంచంలోనే రెండు దిగ్గజ సంస్థల మధ్య జరుగుతున్న వార్ ఇది. ఆపిల్ సీఈవో టిమ్ కుక్ పద్ధతి నచ్చని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకెర్‌బర్గ్.. ఇక నుంచి స్టాఫ్ ఎవరూ ఆపిల్ ఉత్పత్తులను వాడకూడదని ఆదేశాలు జారీ చేయడం విశేషం. ఫేస్‌బుక్ యూజర్ల ప్రైవసీపై కుక్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని జుకెర్‌బర్గ్ సహించలేకపోయారు. వెంటనే తన ఎగ్జిక్యూటివ్స్‌ను పిలిచి ఐఫోన్లు వాడొద్దని స్పష్టం చేశారు. ఆపిల్ బదులు ఆండ్రాయిడ్ డివైస్‌లను ప్రోత్సహించాల్సిందిగా ఆయన సూచించడం విశేషం. ఎంఎస్‌ఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఫేస్‌బుక్‌పై పరోక్షంగా స్పందించారు.
ఆపిల్ ఎప్పుడూ యూజర్ల వ్యక్తిగత జీవితాలు, గోప్యతకు భంగం వాటిల్లకుండా చూస్తుందని కుక్ అన్నారు. గోప్యత అనేది ప్రతి మనిషికి ఉండే ఓ హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది మొదట్లో యూజర్ల ప్రైవసీని ఫేస్‌బుక్ దెబ్బతీసిందన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణంతో ఫేస్‌బుక్ బాగోతం బయటపడింది. దీనినే కుక్ పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు.
అయితే ఆ కామెంట్స్ జుకెర్‌బర్గ్‌కు ఎక్కడలేని ఆగ్రహాన్ని తెప్పించాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







