ఈ చిట్కాలు పాటిస్తే.. నీరసం తగ్గుతుంది...
- November 16, 2018
సాధారణంగా కొంతమంది ఎప్పుడు చూసినా నీరసంగా, అలసటగా కనిపిస్తుంటారు. ఎందువలనంటే.. అనారోగ్యం, పౌష్టికాహారలోపం, పని ఒత్తిడి వంటి కారణాలుండొచ్చు. రోజంతా ఇలా గడపడం చిరాకుగా ఉంటుంది. కనుక ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉండానికి ఇలా చేస్తే చాలు.. మంచి ఉపశమనం లభిస్తుంది.. అవేంటో తెలుసుకుందాం..
1. ప్రతిరోజూ ఉదయాన్నే వ్యాయామం చేస్తే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. దాంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. ఆహార పదార్థాలు తీసుకునే విషయంలో కొవ్వు అధికంగా ఉండే వాటిని తినకూడదు. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటే అలసట తొలగిపోతుంది.
2. రోజూ గ్లాస్ నిమ్మరసంతో కొద్దిగా తేనె, ఉప్పు కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.
3. నిద్రలేమి వలన నీరసంగా, అలసటగా ఉంటారు. నిద్రమనకు చాలా ముఖ్యం.. కనుక రాత్రివేళలో పాలలో కొద్దిగా మిరియాల పొడి, తేనె, చక్కెర కలిపి సేవిస్తే చక్కని నిద్రపడుతుంది. తద్వారా నిద్రేలేమి సమస్యను నివారించవచ్చును.
4. శరీరంలో రక్తం లేని వలన కూడా నీరసంగా ఉంటుంది. అలాంటప్పుడు ప్రతిరోజూ పాలలో ఖర్జూరాన్ని నానబెట్టి తీసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన రక్తసరఫరా మెరుగుపడుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







