ఈ చిట్కాలు పాటిస్తే.. నీరసం తగ్గుతుంది...
- November 16, 2018సాధారణంగా కొంతమంది ఎప్పుడు చూసినా నీరసంగా, అలసటగా కనిపిస్తుంటారు. ఎందువలనంటే.. అనారోగ్యం, పౌష్టికాహారలోపం, పని ఒత్తిడి వంటి కారణాలుండొచ్చు. రోజంతా ఇలా గడపడం చిరాకుగా ఉంటుంది. కనుక ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉండానికి ఇలా చేస్తే చాలు.. మంచి ఉపశమనం లభిస్తుంది.. అవేంటో తెలుసుకుందాం..
1. ప్రతిరోజూ ఉదయాన్నే వ్యాయామం చేస్తే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. దాంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. ఆహార పదార్థాలు తీసుకునే విషయంలో కొవ్వు అధికంగా ఉండే వాటిని తినకూడదు. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటే అలసట తొలగిపోతుంది.
2. రోజూ గ్లాస్ నిమ్మరసంతో కొద్దిగా తేనె, ఉప్పు కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.
3. నిద్రలేమి వలన నీరసంగా, అలసటగా ఉంటారు. నిద్రమనకు చాలా ముఖ్యం.. కనుక రాత్రివేళలో పాలలో కొద్దిగా మిరియాల పొడి, తేనె, చక్కెర కలిపి సేవిస్తే చక్కని నిద్రపడుతుంది. తద్వారా నిద్రేలేమి సమస్యను నివారించవచ్చును.
4. శరీరంలో రక్తం లేని వలన కూడా నీరసంగా ఉంటుంది. అలాంటప్పుడు ప్రతిరోజూ పాలలో ఖర్జూరాన్ని నానబెట్టి తీసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన రక్తసరఫరా మెరుగుపడుతుంది.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..