ఆమె కోసం 'సైరా' షూటింగ్ చకచకా
- November 16, 2018
సురేందర్ రెడ్డి - చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'సైరా'. చిరు సరసన నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార తమిళం మంచి క్రేజ్ ఉంది. అక్కడ ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి స్టార్ హీరోల సినిమాల స్థాయిలో కాసుల వర్షం కురుస్తుండటం విశేషం. దాంతో ఆమెకు అక్కడ అవకాశాలు మీద అవకాశాలు వస్తున్నాయి. దాంతో ఆమె తెలుగులో సినిమాలు తగ్గించేసింది.
బాలకృష్ణ..వెంకటేష్..చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాలు తప్ప తెలుగులో సినిమాలు ఒప్పుకోవడంలేదు. ఈనేపథ్యంలో ఆమె 'సైరా'లో చేయడానికి అంగీకరించినా, ఆమె ఇచ్చిన డేట్స్ తక్కువేనట. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ కోసం ఆమె ఇచ్చిన డేట్స్ 3 రోజులేనట.
సో డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఆమెకు సంబంధించి సీన్స్ అన్ని ఫాస్ట్ గా పూర్తి చేస్తున్నాడట. లేదంటే మళ్లీ ఆమె డేట్స్ ఎప్పటికో గాని లేవట. చాలా ప్లాన్డ్ గా ఆ సీన్స్ షూట్ చేస్తున్నారని తెలుస్తుంది. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈసినిమా వచ్చే ఏడాది సమ్మర్ రిలీజ్ అవ్వవచ్చని చెబుతున్నారు కానీ అప్పటికి డౌటే అంటున్నారు సినీ విశ్లేషకులు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







