ఫ్లూ: విద్యార్థి మరణంతో అలర్ట్
- November 16, 2018
దుబాయ్‌కి చెందిన విద్యార్థి అలియా నియాజ్ అలి అనుమానాస్పద ఫ్లూ సమస్యలతో మృతి చెందడంతో, పలు స్కూళ్ళు హెల్త్ అలర్ట్‌ని జారీ చేశాయి. విద్యార్థులకు ఏమాత్రం నలత వున్నా తల్లిదండ్రులు వారిని ఇంటి వద్దనే వుంచాలని ఈ అలర్ట్‌లో విద్యా సంస్థలు పేర్కొంటున్నాయి. అయితే అలియాకి వైద్య చికిత్స అందించిన రషీద్ హాస్పిటల్ వైద్య సిబ్బంది మాత్రం, ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్‌గా పేర్కొంది. 17 ఏళ్ళ అలియా, ఇండియన్ హైస్కూల్‌లో విద్యనభ్యసించడం జరిగింది. ఫ్లూ తరహా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న అలియాకి, తొలుత ప్రైవేటు క్లినిక్‌లో వైద్య చికిత్స అందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఎమర్జన్సీ కండిషన్‌లో రషీద్ హాస్పిటల్‌కి తరలించారు. అక్కడామెకు వైద్య చికిత్స ప్రారంభించినా, ఆమె ప్రాణాల్ని కాపాడలేకపోయారు వైద్యులు. విద్యార్థి మృతి పట్ల తాము ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు రషీద్ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







