కువైట్‌లో వరద బీభత్సం: విమానాల రద్దు, స్కూళ్ళ మూసివేత
- November 16, 2018
కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి విమానాల రాకపోకల్ని నిలిపివేశారు. కువైట్ క్యాపిటల్‌ని ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో స్కూళ్ళను సైతం తాత్కాలికంగా మూసివేశారు. భారీగా కురుస్తున్న వర్షాలతో పరిస్థితి భీతావహంగా మారిందనీ, ప్రాణ నష్టం తగ్గించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని అధికారులు పేర్కొంటున్నారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన విమానాల్ని, దుబాయ్, బహ్రెయిన్ దమ్మమ్ విమానాశ్రయాలకు మళ్ళిస్తున్నట్లు కువైట్ సివిల్ ఏవియేషన్ హెడ్ షేక్ సల్మాన్ అల్‌సబా చెప్పారు. మరో రెండు రోజులపాటు ఇవే పరిస్థితులు కువైట్‌లో కొనసాగే అవకాశం వున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంటోంది. కేవలం రెండు రోజుల్లోనే 96 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఇది దేశానికి సంబంధించి వార్షిక వర్షపాతం. పబ్లిక్ ఆఫీసులు సైతం వర్షాలు, వరదల కారణంగా మూతపడ్డాయి. కువైట్ బోర్డర్‌లో అల్ హఫర్ అల్ బాతిన్ వద్ద 46 మందితో వెళుతున్న బస్సుని గుర్తించి, అందులోనివారిని రక్షించినట్లు సౌదీ అరేబియా సివిల్ డిఫెన్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







