హరారే:బస్సులో గ్యాస్ ట్యాంక్ పేలి 42 మంది మృతి

- November 16, 2018 , by Maagulf
హరారే:బస్సులో గ్యాస్ ట్యాంక్ పేలి 42 మంది మృతి

హరారే: జింబాబ్వేలో ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో దాదాపు 42 మంది మరణించారు. 20 మంది తీవ్ర గాయాలపాలైనట్లు శుక్రవారం పోలీసులు వెల్లడించారు. బస్సులో ఉన్న గ్యాస్‌ ట్యాంక్‌ పేలడమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఆ దేశ రాజధాని హరారేకు 550 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్వాండా ప్రాంతంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. సమాచారం ప్రకారం 42 మంది ప్రయాణికులు మరణించారు అని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఆ గ్యాస్ ట్యాంక్‌ ప్రయాణికుల్లో ఒకరిదిగా భావిస్తున్నారు. జింబాబ్వే రెడ్ క్రాస్‌ ట్విటర్‌లో పెట్టిన ఫొటోల్లో బస్సు పూర్తిగా కాలిపోయి కనిపిస్తుంది. ఈ నెల మొదట్లో హరారే, రుసపే హైవే మీద రెండు బస్సులు ఢీకొనడంతో 47 మంది దుర్మరణం పాలయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com