ఫాగ్‌ కండిషన్స్‌: ఈ ఉల్లంఘనలకు జరీమానా

- November 16, 2018 , by Maagulf
ఫాగ్‌ కండిషన్స్‌: ఈ ఉల్లంఘనలకు జరీమానా

దుబాయ్‌ రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ), యూఏఈ రెసిడెంట్స్‌కి స్పెషల్‌ వార్నింగ్‌ టెక్స్‌ట్‌ మెసేజ్‌లను పంపింది. రఫ్‌ వెదర్‌ కండిషన్స్‌లో వాహనాలు నడిపేవారు హై బీమ్‌ హెడ్‌ ల్యాంప్‌ లైటింగ్‌ని వినియోగిస్తే 500 దిర్హామ్‌ల జరీమానా, 4 బ్లాక్‌ పాయింట్స్‌ విధిస్తారు. ఫాగ్‌ కండిషన్స్‌ నేపథ్యంలో లో బీమ్‌ లైట్‌ని వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు. వైపర్‌ బ్లేడ్స్‌, విండో డెమిస్టర్స్‌ వర్కింగ్‌ కండిషన్‌లో వున్నాయో లేవో డ్రైవర్లు చెక్‌ చేసుకోవాల్సి వుంటుంది. నెమ్మదిగా వెళ్ళడం, ముందు వాహనాలతో తగినంత దూరానికి రెండింతల దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోక తప్పనిసరి. ఫాగ్‌ కండిషన్స్‌లో లైట్స్‌ని వినియోగించకపోయినా 500 దిర్హామ్‌ల జరీమానా, 4 బ్లాక్‌ పాయింట్స్‌ విధిస్తారు. హజార్డ్‌ లైట్స్‌ని వినియోగించరాదు. సాధారణ విజిబిలిటీ వున్నప్పుడు వెనుక ఫాగ్‌ లైట్స్‌ వాడకూడదు. వాడీస్‌కి దూరంగా వుండాలి. వర్షం పడుతున్న సమయంలో లోతట్టు ప్రాంతాల్లో వుండకూడదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com