తెలంగాణ:బీజేపీ నాలుగో జాబితా విడుదల
- November 17, 2018
తెలంగాణలో ఎన్నికల నామినేషన్లకు గడువు ముంచుకొస్తుండటంతో కమలదళం వేగం పెంచింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 7 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ బీజేపీ నాలుగో జాబితాను విడుదల చేసింది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి జగత్ ప్రకాశ్ నడ్డా అభ్యర్ధుల జాబితా ప్రకటించారు. ఇప్పటికే 86 నియోజకవర్గాలకు కేండట్లను డిక్లేర్ చేసిన బీజేపీ అధిష్టానం తాజాగా ఏడు స్థానాలకు అభ్యర్థులను ఫిక్స్ చేసింది. మొదటి జాబితాలో 38 స్థానాలు, రెండో లిస్టులో మరో 28 మందికి అవకాశం కల్పించింది. మూడో జాబితాలో 20 స్థానాలకు టికెట్లు ఖరారు చేశారు. తాజా జాబితాలో పేరుంటుందని ఆశించిన కొందరి నేతల ఆశలు ఆవిరయ్యాయి.
చెన్నూరు నియోజకవర్గానికి – అందుగుల శ్రీనివాసులు,జహీరాబాద్- జంగం గోపి,గజ్వేల్- ఆకులవిజయ,జూబ్లీహిల్స్- శ్రీధర్‌రెడ్డి, నర్సంపేట్- ఎడ్ల అశోక్‌రెడ్డి,సనత్‌నగర్- భావర్లాల్ వర్మ, పాలకుర్తి- సోమయ్య గౌడ్‌కు బిజెపి టికెట్ కేటాయించింది
మరోవైపు తెలంగాణలో అమిత్ షా పర్యటన ఖరారైంది. ఈనెల 25, 27, 28 తేదీల్లో బీజేపీ చీఫ్ పర్యటించనున్నారు. మూడు రోజులపాటు 12 ఎన్నికల ప్రచార సభల్లో అమిత్‌షా పాల్గొంటారు. అదిలాబాద్, పెద్దపల్లి, పరకాల, మహేశ్వరం, కల్వకుర్తి, మహబూబానగర్, కొత్తగూడెం, సూర్యాపేట, చౌటుప్పల్, నిజామాబాద్, కామారెడ్డి, దుబ్బాక సభలో ప్రభుత్వ వైఫల్యాల్ని షా ఎండగట్టనున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!