అక్క పోటీ నిర్ణయంపై ట్విట్టర్ ద్వారా స్పందించిన తమ్ముళ్లు
- November 17, 2018
తెలంగాణ ఎన్నికల సందర్బంగా కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని నిర్ణయంపై మొదటిసారి ఆమె ఇద్దరు తమ్ముళ్లు స్పందించారు. అక్కకోసం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు చిన్న తమ్ముడు ఎన్టీఆర్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఆమె పబ్లిక్ సర్వీసులో తన మొట్టమొదటి దశను తీసుకుంటుంది. ‘ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో తాతగారు సర్గీయ తారకరామారావుగారు తెలుగుదేశం పార్టీ మాకు ఎంతో పవిత్రమైనది. మా నాన్నగారు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారు సేవలందించిన తెలుగుదేశం పార్టీ తరుపున ఇప్పుడు మా సోదరి సుహాసిని గారు కూకట్ పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న సంగతి మీకు తెలిసినదే. స్త్రీలు సమాజంలో ఉన్నతమైన పాత్రను పోషించాలి అని నమ్మే కుటుంబం మాది. ఇదే స్పూర్తితో ప్రజాసేవకు సిద్దపడుతోన్న మా సోదరి సుహాసిని గారికి విజయం వారించాలని ఆకాంక్షిస్తూ.. జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ .. మీ నందమూరి కళ్యాణ్ రామ్, తారకరామారావు’ అని పేర్కొంటూ ఇద్దరు అన్నదమ్ములు ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!