తెలంగాణ:కాంగ్రెస్ మూడో జాబితా విడుదల
- November 17, 2018
హైదరాబాద్: 13 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితాను విడుదల చేసింది. అధిష్ఠానం ఆమోద ముద్ర అనంతరం ఈ జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పోటీ విషయంలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత సందిగ్ధత వీడిన విషయం తెలిసిందే. ఆయన జనగామ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ఆ పార్టీ రాష్ర్ట వ్యవహారాల బాధ్యుడు ఆర్సీ కుంతియా స్పష్టం చేశారు. కోదండరాం పెద్ద మనుసు చేసుకుని ఆ స్థానాన్ని కాంగ్రెస్‌కు ఇచ్చారని తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి 12 తర్వాత కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య నాంపల్లిలోని తెలంగాణ జనసమితి కార్యాలయంలో భేటీ అయి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా పొన్నాల లక్ష్మయ్య సహా 13 మందితో కాంగ్రెస్ తాజా జాబితాను విడుదల చేసింది.
అభ్యర్థుల వివరాలు..
భోథ్(ఎస్టీ)- సోయం బాపురావు
నిజామాబాద్ అర్బన్-తాహెర్ బిన్ హమ్దాన్
నిజామాబాద్ రూరల్ - డా. రేకుల భూపతి రెడ్డి
బాల్కొండ- ఈ. అనిల్‌కుమార్
ఎల్బీనగర్ -డి. సుధీర్‌రెడ్డి
కార్వాన్-ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజారి
యాకత్పురా- కె. రాజేందర్ రాజు
బహదూర్‌పుర - కలేం బాబా
కొల్లాపూర్ - బీరం హర్షవర్ధన్‌రెడ్డి
దేవరకొండ(ఎస్టీ)- బాలునాయక్
తుంగతుర్తి(ఎస్సీ)-అద్దంకి దయాకర్
జనగామ - పొన్నాల లక్ష్మయ్య
ఇల్లందు(ఎస్టీ)- బానోత్ హరిప్రియ నాయక్
తాజా జాబితాతో ఇప్పటివరకూ మొత్తం 88 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది. ఇంకా ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం మరో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసే అవకాశం ఉంది. మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ మొత్తం 94 స్థానాల్లో పోటీ చేస్తోంది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసార 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..