విడుదల అయిన 'తెలంగాణ దేవుడు' ట్రైలర్
- November 18, 2018
తెలంగాణాలో ఎన్నికల నగారా మోగింది. ప్రచారాలు ఊపందుకున్నాయి. సరిగ్గా ఈ తరుణంలో చడీచప్పుడు లేకుండా 'తెలంగాణ దేవుడు' ట్రైలర్ రిలీజ్ కావటంతో అంతా అవాక్కయ్యారు. అంతేకాండోయ్.. ఇదివరకు వచ్చిన అన్ని ట్రైలర్స్‌కి భిన్నంగా 6 నిమిషాల 3 సెకనుల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్‌లో పలు ఆసక్తికర, ఆలోచింపజేసే సన్నివేశాలు చూపించారు. హరీష్ దర్శకత్వంలో మహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన 'తెలంగాణ దేవుడు' మూవీ.. కేసీఆర్ బయోపిక్ అని తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా వదిలిన ఈ ట్రైలర్‌లో శ్రీకాంత్, సుమన్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ళ భరణి, అజయ్, ప్రభాకర్, షియాజీ షిండే, సంగీత తదితర భారీ తారాగణం కనిపించటంతో ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు. చిత్రంలో విజయ్ దేవ్ అనే పేరుతో లీడ్ రోల్ పోషిస్తున్నాడు శ్రీకాంత్. ట్రైలర్ ప్రకారం చూస్తే.. కేసీఆర్ బాల్యం నుంచి మొదలు యవ్వనం, రాజకీయ ప్రవేశం, ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం కవర్ చేశారని అనిపిస్తోంది. మొత్తానికైతే ఈ ట్రైలర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం కావటం విశేషం.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







