'తెలంగాణ దేవుడు' ఆడియో విడుదల

- November 19, 2018 , by Maagulf
'తెలంగాణ దేవుడు' ఆడియో విడుదల

శ్రీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం తెలంగాణ దేవుడు. సంగీత, జిషాన్‌ ఉస్మానీ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. హరీష్‌ వడ్‌త్యా దర్శకత్వంలో మ్యాక్స్‌ ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మాత. నందన్‌ సంగీతాన్ని అందించిన తెnలంగాణ దేవుడు చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు హరీష్‌ వడ్‌త్యా మాట్లాడుతూ.నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతే దేవుడు. తెలంగాణ పోరాటం ఇతివృత్తంతో సినిమా ఉంటుంది. నిర్మాత సినిమాను నాణ్యమైన సాంకేతిక విలువలతో అనుకున్న దాని కంటే ఎక్కువ ఖర్చుపెట్టి చేశారు. అందరికీ నచ్చే సినిమా అవుతుంది. అన్నారు. నాయిక సంగీత మాట్లాడుతూ.శ్రీకాంత్‌ నాకు కలిసొచ్చిన కథానాయకుడు. మేమిద్దరం కలిసి ఐదు చిత్రాల్లో నటించాం. ఈ చిత్రంతో కొంత విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తున్నాను. సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకుంటాయి. అన్నారు. శ్రీకాంత్‌ మాట్లాడుతూ.కేసీఆర్‌ గారి పాత్రలో నటించడం గర్వంగా ఉంది. ముందు కథ విన్నప్పుడు చేయగలనా లేదా అని అనుకున్నాను. కథలో చాలా భావోద్వేగాలు ఉంటాయి. ఎక్కడా పొరపాటు లేకుంటా జాగ్రత్తగా చేసిన చిత్రమిది. అన్నారు. బ్రహ్మానందం, సుమన్‌, అలీ, షాయాజీ షిండే, పోసానీ, తనికెళ్ల భరణి, అజయ్‌ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com