ఫ్రాన్స్‌లో నిరసన జ్వాలలు ..400 మందికి గాయాలు

- November 19, 2018 , by Maagulf
ఫ్రాన్స్‌లో నిరసన జ్వాలలు ..400 మందికి గాయాలు

ఫ్రాన్స్‌లో చమురు సుంకం పెంపుపై నిరసనలు ఉధృతమయ్యాయి. ఘర్షణల్లో 400 మందికిపైగా గాయపడగా ఒకరు మృత్యువాతపడ్డారు. దేశవ్యాప్తంగా పసుపుపచ్చ జాకెట్‌లు వేసుకుని వీధుల్లోకి దిగిన ఆందోళనకారులు ప్రధాన రహదారులను దిగ్బంధించారు. గాయపడినవారిలో 28 మంది పోలీసులు, సైన్యం, అగ్నిమాపక దళాలకు చెందిన జవాన్లు ఉన్నారు. మొత్తంగా 2,034 ప్రాంతాల్లో జరిగిన ఈ నిరసనల్లో 2,88,000 మంది పాల్గొన్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు. 157 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com