లోయలో పడిన బస్సు.. 12 మంది ప్రాణాలు..
- November 19, 2018
ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఉత్తరకాశి జిల్లాలోని వికాస్ నగర్ నుంచి జంకిచట్టికి ప్రయాణీకులతో వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు 150 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడింది. బస్సులో మొత్తం 25 మంది ప్రయాణీకులు ఉండగా వారిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. గాయపడినవారిని హెలికాప్టర్‌లో డెహ్రాడూన్‌లోని హాస్పిటల్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి తగిన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







