#RRR షూటింగ్ షురూ!
- November 19, 2018
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న తారక్-చరణ్ ల మల్టీస్టారర్ 'RRR' (వర్కింగ్ టైటిల్) రెగ్యూలర్ షూటింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అయ్యింది. ఈ విషయాన్ని చెబుతూ దర్శకుడు రాజమౌళి ట్విట్ చేశారు. తొలిరోజు సెట్స్ లో తారక్, చరణ్ లతో కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేశారు. తొలిరోజు షూటింగ్ లో పాల్గొనబోతున్న చరణ్ కి ఆయన సతీమణి ఉపాసన 'ఆల్ ది బెస్ట్' చెబుతూ ట్విట్ చేసింది. చరణ్ తో తారక్ కూడా తొలిరోజే నుంచే షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.
ఈ సినిమా కోసం 'రామ రావణ రాజ్యం', 'తారక్‌రామ్' అనే టైటిళ్లను ప్రచారంలో ఉన్నాయి. దీన్ని బట్టి తారక్, చరణ్ లలో ఒకరు నెగటివ్ షేడ్స్ ఉన్నపాత్రల్లో కనిపించబోతున్నారనే విషయం అర్థమవుతోంది. వీరి సరసన జతకట్టే హీరోయిన్స్ ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం ముగ్గురు హీరోయిన్స్ ఉండబోతున్నారు. ఇందులో ఒకరు ఫారిన్ బ్యూటీని చెబుతున్నారు.
ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2020లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







