జొనాస్‌కు మధుమేహం.. మరి ప్రియాంక ఎలా స్పందించిందో చూడండి
- November 19, 2018
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కాబోయే భర్త నిక్ జొనాస్ టైప్-1 డయాబెటిస్తో బాధ పడుతున్నాడు. స్వయంగా అతడే ట్విటర్లో ఈ విషయం వెల్లడించాడు. '13 సంవత్సరాల క్రితం నాకు టైప్-1 డయాబెటిస్ ఉందని గుర్తించారు. వ్యాధి నిర్ధారించిన కొన్ని వారాల తరువాత నేను ఎలా ఉన్నానో ఎడమవైపునున్న ఫొటో తెలుపుతుంది. తర్వాత నేను 100 పౌండ్ల బరువు తగ్గాను. వెంటనే వైద్యుడిని సంప్రదించాను. ఆ తర్వాతే నాకు మధుమేహం ఉందని తెలిసింది.' అని జొనాస్ ట్వీట్ చేశారు. 'నీకు మధుమేహం ఉన్నా.. లేకపోయినా నువ్వు నాకు ప్రత్యేకమే' అని ప్రియాంక దీనిపై స్పందించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







