తెలుగు కళా సమితి 20వ వార్షిక వేడుకలు

- November 19, 2018 , by Maagulf
తెలుగు కళా సమితి 20వ వార్షిక వేడుకలు

బహ్రెయిన్‌ తెలుగు కళా సమితి, 20వ వార్షిక ఉత్సవాలకు రంగం సిద్ధమయ్యింది. నవంబర్‌ 23న ఏసియన్‌ స్కూల్‌ - ఎపిజె అబ్దుల్‌ కలాం ఆడిటోరియం ఇందుకు వేదిక కానుంది. 'రంగస్థలం - ఆట పాట' పేరుతో ఈ మెగా షోని డిజైన్‌ చేశారు. భారతదేశం నుంచి పలువురు కళాకారులు, ఈ వేదికపై సందడి చేస్తారు. 2,500 మందికి పైగా తెలుగువారు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. సింగర్స్‌ మల్లికార్జున్‌, దామిని భట్ల, బిగ్‌బాస్‌ 2 తెలుగు ఫేం భానుశ్రీ, ఢీ డాన్స్‌ షో యశ్వంత్‌ ఈ డాన్స్‌ ఈవెంట్‌లో సందడి చేస్తారు. టికెఎస్‌ జనరల్‌ సెక్రెటరీ, ఈవెంట్‌ జనరల్‌ కన్వీనర్‌ ఎంబీ రెడ్డి మాట్లాడుతూ, ఈ షోని సూపర్‌ సక్సెస్‌ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. టిక్కెట్స్‌, మెంబర్‌ పాస్‌ల కోసం గంగా సాయిని 36063322 నెంబర్‌లోనూ, అనిల్‌ పామిడిని 38829360 నెంబర్‌లోనూ సంప్రదించవచ్చు. 

ఎం.వాసుదేవ రావు, మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com