తీవ్రవాదం కేసులో ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష

- December 22, 2015 , by Maagulf
తీవ్రవాదం కేసులో ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష

పేలుడు పదార్థాల్ని ఉపయోగిస్తున్నారనీ, తీవ్రవాద చర్చలకు పాల్పడుతున్నారనే అభియోగాలున్న ఐదుగురు వ్యక్తులకు హై క్రిమినల్‌ కోర్ట్‌ యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్లు చీఫ్‌ ఆఫ్‌ టెర్రర్‌ క్రైమ్‌ ప్రాసిక్యూషన్‌ అడ్వొకేట్‌ జనరల్‌ అహ్మద్‌ అల్‌ హమ్మది చెప్పారు. 2014 జూన్‌ 2 నాటి ఈ కేసులో, నిందితులు అల్‌ జనాబియా హైవేపై బుదైయా వద్ద బాంబను పేల్చారు. విచారణలో నిందితుల ప్రమేయంపై ఆధారాలు వెల్లడయ్యాయి. ముగ్గురు నిందితులు బాంబుని ఓ ఇంట్లో తయారు చేయగా, ఇంకో నిందితుడు బాంబులో అమర్చిన ఫోన్‌కోసం సిమ్‌కార్డ్‌ని అక్రమంగా కొనుగోలు చేశాడు. మరో నిందితుడి ఇంట్లో బాంబు తయారైంది. పోలీసుల్ని చంపేందుకు ఈ బాంబుని తయారుచేసినట్లు విచారణలో వెల్లడయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com