పంకజ్ మళ్లీ ప్రపంచ విజేత
- November 20, 2018
యాంగ్వాన్ (మయన్మార్): భారత స్టార్ క్యూయిస్టు పంకజ్ అద్వానీ చరిత్ర సృష్టించాడు. పోటీకి మరోమారు ఘనంగా చాటి చెప్పాడు. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తూ ఐబిఎస్‌ఎఫ్ బిలియర్డ్స్ చాంపియ న్‌షిప్‌ను కైవసం చేసుకుంటూ ఏకంగా 21వ సారి ప్రపంచ విజేతగా నిలిచి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. రెండు రోజుల వ్యవధిలోనే మరో ప్రపంచ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంటు తనకు తిరుగులేదని నిరూపించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో పంకజ్.. భారత్‌కు చెందిన భాస్కర్‌పై అలవోక విజయం సాధించాడు. రెండుసార్లు ఆసియా రజత పతక విజేత అయిన భాస్కర్‌ను అద్వానీ అలవోకగా ఎదుర్కొం టూ గేమ్‌ను దక్కించుకున్నాడు. వరుస గేముల్లో 190, 173, 198 స్కోర్లతో అద్వానీ తన దూకుడు కొనసాగించగా, భాస్కర్ మాత్రం సెంచరీ మార్క్ అందుకోవడానికి నానా కష్టాలు పడ్డాడు. తనదైన రీతిలో పాయింట్లు కొల్లగొడుతూ పంకజ్ 1000 మార్క్‌ను అందుకుంటే.. ప్రత్యర్థి 206కే పరిమితమై అందనంత దూరంలో ఆగిపోయాడు.గతేడాది ఇక్కడే జరిగిన ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన ఈ దిగ్గజ క్యూయిస్టుకు బిలియర్డ్స్‌లో కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టైటిల్ గెలిచిన అనంతరం మాట్లాడుతూ బిలియర్డ్స్‌లో నాలుగో గ్రాండ్ డబుల్‌తో ఈ ప్రపంచాన్ని జయించినట్లు ఉంది.భాస్కర్, కాజియర్, రస్సెల్ లాంటి దీటైన ప్రత్యర్థులను ఎదుర్కొవడం అంత సులువేమి కాదు. కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం నమ్మశక్యంగా ఉంది. 21వ ప్రపంచ టైటిల్‌తో ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇదే జోరును కొనసాగిస్తూ స్నూకర్ టైటిల్‌ను నిలబెట్టుకోవాలనుకుంటున్నాను అని పంకజ్ అన్నాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







