యూఏఈలో గురుదేవ్ రవిశంకర్ 'హ్యాపీనెస్ ఈవెంట్స్'
- November 20, 2018
యూ.ఏ.ఈ:హ్యుమానిటేరియన్ లీడర్, వరల్డ్ టోలరెన్స్ డే సందర్భంగా, శాంతి ప్రవచనాల్ని అందించారు. నాలుగు రోజుల యూఏఈ పర్యటనలో భాగంగా గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ఇచ్చిన సందేశం, అలాగే మెడిటేషన్ గురించి ఆయన చేసిన ప్రసంగాలు చాలామందిని ఆకట్టుకున్నాయి, ఆలోచింపజేశాయి. ఫుజారియా గవర్నమెంట్ ఆహ్వానం మేరకు రవిశంకర్, ఈ పర్యటన చేపట్టారు. మైండ్ ఎక్స్‌పాన్షన్‌కి సంబంధించి అద్భుతమైన టెక్నాలజీగా మెడిటేషన్‌ని అభివర్ణించారు శ్రీశ్రీ రవిశంకర్. మనుషుల్లోని పాజిటివిటీని పెంచడమే మెడిటేషన్ లక్ష్యమని ఆయన చెప్పారు. చర్చలు, వర్క్ షాప్‌లను యూఏఈలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తూ, ఆర్ట్ ఆఫ్ డి స్ట్రెస్సింగ్‌పై అవగాహన కల్పించారు. ఫుజారియా, షార్జా, దుబాయ్‌లలో రవిశంకర్ ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో నేషనాలిటీస్‌కి అతీతంగా, బ్యాక్‌గ్రౌండ్స్‌కి అతీతంగా పలువురు పాల్గొని, రవిశంకర్ ప్రసంగాల పట్ల ఆకర్షితులయ్యారు. శ్రీశ్రీ రవిశంకర్, 156కి పైగా దేశాల్లో 360 మిలియన్లకు పైగా ప్రజలతో మమేకం అయి, తన సందేశాల్ని వారికి అందించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!