దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ గెల్చుకున్న భారతీయ వలసదారుడు
- November 20, 2018
దుబాయ్‌కి చెందిన భారతీయ వలసదారుడు నౌషద్ సుబిర్, తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ విజేతగా నిలిచారు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ప్రమోషన్‌లో భాగంగా టిక్కెట్ 0520 టిక్కెట్ సిరీస్ 286 ఈ బహుమతిని నౌషద్ సుబీర్‌కి అందించింది. ఆన్‌లైన్‌లో సుబీర్ ఈ టిక్కెట్‌ని కొనుగోలు చేశారు. తాను పనిచేస్తున్న రెడా గ్రూప్‌కి చెందిన మరో తొమ్మిది మందితో కలిసి ఈ టిక్కెట్ ధరని షేర్ చేసుకున్నారు సుబీర్. దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ గెల్చుకోవడంపై సుబీర్ మాట్లాడుతూ, ఈ గెలుపుతో తామంతా లక్కీ అని ప్రూవ్ అయ్యిందని చెప్పారు. దుబాయ్‌లో 20 ఏళ్ళుగా సుబీర్ నివసిస్తున్నారు. ఈ రాఫెల్ గెల్చుకోవడం ద్వారా సుబీర్ ఈ ఘనతను సాధించిన 137వ ఇండియన్‌గా రికార్డులకెక్కారు. ఇండియాకే చెందిన పర్వీన్ షేక్ ఆసిఫ్ అనే 43 ఏళ్ళ వ్యక్తికి బిఎండ్బ్యుల ఆర్ 1200 ఆర్ మోటార్ బైక్ ఈ రాఫెల్లో దక్కింది.
తాజా వార్తలు
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!