దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ మరో వారం పొడిగింపు
- November 20, 2018
దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటెయిల్ ఎస్టాబ్లిష్మెంట్స్ - ఈ ఏడాది దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌ని అదనంగా మరో వారం పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఈ షాపింగ్ ఫెస్టివల్ జరుగుతుంది. దుబాయ్ టూరిజం ఏజెన్సీ అయిన దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటెయిల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (డిఎఫ్‌ఆర్‌ఇ) ఈ ఫెస్టివల్‌ని నిర్వహిస్తుంది. 24 వ ఎడిషన్‌ని అదనంగా మరో వారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అదనపు పొడిగింపుతో షాపింగ్ ప్రియులకు మరింత వెసులుబాటు కలుగుతుందని వారంటున్నారు. ఈ షాపింగ్ ఫెస్టివల్ బోల్డన్ని ఈవెంట్స్‌కి వేదికగా నిలుస్తుంటుంది. డిఎఫ్‌ఆర్‌ఇ సిఇఓ అహ్మద్ అల్ ఖాజా మాట్లాడుతూ, రిటెయిల్ క్యాలెండర్లో దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌ని మోస్ట్ పాపులర్ ఫెస్టివల్‌గా అభివర్ణించారు. ప్రతి యేడాది అంచనాలకు మించి షాపింగ్ ప్రియులు, దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్లో సందడి చేస్తున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..