తెలంగాణ:నామినేషన్ల తిరస్కరణ లిస్ట్‌లో టీఆర్‌ఎస్, టీజేఎస్ అభ్యర్థులు..
- November 21, 2018
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కొంత మంది అభ్యర్థులకు ఎదురుదెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు నాయకులు నామినేషన్ దాఖలు చేశారు. మరి కొందరికి నామినేషన్ల తిరస్కరణ కూడా జరిగింది.
అంతా సవ్యంగా సాగుతోందనుకున్న సమయంలో నామినేషన్ల తిరస్కరణతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. పత్రాలు సరిగ్గా లేకపోవడంతో కొన్నిచోట్ల రిటర్నింగ్ అధికారులు వాటిని తిరస్కరిస్తున్నారు. నామినేషన్ల తిరస్కరణ లిస్ట్‌లో ఖానాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థి రేఖానాయక్, స్టేషన్‌ఘన్‌పూర్ టీజేఎస్ అభ్యర్థి చింతాస్వామి ఉన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న నామినేషన్ పై గందరగోళం నెలకొంది. ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుండి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేఖానాయక్ విజయం సాధించారు. కేసీఆర్ ఈ దఫా కూడ ఆమెకే టికెట్టు కేటాయించారు.
ఖానాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా రేఖా నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ నామినేషన్‌లో తప్పులు ఉన్నట్టుగా రిటర్నింగ్ అధికారులు గుర్తించారు. రేఖానాయక్ దాఖలు చేసిన మూడు సెట్లలోనూ ఓ కాలమ్ ఖాళీగా ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ విషయమై ఏం చేయాలనే దానిపై జిల్లా కలెక్టర్‌కు సమాచారాన్ని ఇచ్చారు రిటర్నింగ్ అధికారి.
ఇదిలా ఉండగా మరోపక్క స్టేషన్‌ఘన్‌పూర్ టీజేఎస్ అభ్యర్థి చింతాస్వామి నామినేషన్‌ను కూడా అధికారులు తిరస్కరించారు. రిజిస్టర్డ్ పార్టీ అభ్యర్థి నామినేషన్ పత్రాలపై 10 మంది ప్రతిపాదించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. జగిత్యాల టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్‌పై జీవన్‌రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు.
వేములవాడ టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వం చెల్లదని.. చట్టాలను మోసం చేశాడని.. ఆయన నామినేషన్ తిరస్కరించాలని.. రిటర్నింగ్ అధికారికి కాంగ్రెస్ అభ్యర్థి ఫిర్యాదు చేశారు. మల్కాజిగిరి మహాకూటమి అభ్యర్థి కపిలవాయి దిలీప్‌కుమార్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో తప్పులు ఉన్నాయంటూ.. తెలంగాణ కూటమి కన్వీనర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







