బాయ్‌ఫ్రెండ్ దారుణ హత్య
- November 21, 2018
యూఏఈ: మొరాకో మహిళ, తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ని అతి కిరాతకంగా హత్య చేసింది. హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా కోసి, కొంత భాగాన్ని వంట చేసి, ఆ వంటకాన్ని తన ఇంటి సమీపంలో వున్న కన్స్ట్రక్షన్ కార్మికులకు వడ్డించింది. ఈ కేసు విచారణ శరవేగంగా జరుగుతోందిప్పుడు. మృతుడి ఆచూకీ కోసం అతని సోదరుడు ప్రయత్నించడంతో ఈ కేసు వెలుగు చూసింది. తన సోదరుడి గురించి, నిందితురాల్ని మృతుడి సోదరుడు ఆరా తీయగా, ఆమె తనకేమీ తెలియదని చెప్పింది. తాము విడిపోయామని తెలిపింది. అయితే, ఆమె ఇంట్లో అనుమానాస్పదంగా కన్పించిన ఓ వస్తువు నేపథ్యంలో పోలీసులకు మృతుడి సోదరుడు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు, నిందితురాలు చేసిన నిర్వాకం తెలిసింది. బాయ్‌ఫ్రెండ్ మృతదేహాన్ని ముక్కలు చేసిన అనంతరం, స్నేహితురాలితో మొత్తం ఇంటిని క్లీన్ చేయించినట్లు విచారణలో నిందితురాలు అంగీకరించింది. డిఎన్ఎ టెస్ట్‌లో మృతుడి పంటి భాగాన్ని నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!