దుబాయ్ ఎయిర్ పోర్ట్లో ఎమర్జన్సీ ఎక్సర్సైజ్
- November 21, 2018
దుబాయ్ ఎయిర్పోర్ట్స్, ఎమర్జన్సీ ఎక్సర్సైజ్ని దుబాయ్ వరల్డ్ సెంట్రల్ (డిడబ్ల్యుసి - ఎమిరేట్ రెండో ఎయిర్ పోర్ట్) వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఎమర్జన్సీ రెస్పాన్స్ కేపబిలిటీస్ని పరీక్షించేందుకోసం ఈ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నారు. జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీతో కలిసి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ ఈ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఎక్సర్సైజ్ జరుగుతున్న సమయంలో దుబాయ్ వరల్డ్ సెంట్రల్లో యధావిధిగా ఇతర కార్యకలాపాలు నడుస్తాయి. దుబాయ్ వరల్డ్ సెంట్రల్లో అల్ మక్తౌమ్ ఇంటర్నేషనల్ అనేది మెయిన్ పార్ట్. 2013లో ఈ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయంగా దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేసినా, కొంతవరకు మాత్రమే ప్రయాణీకులకు ఇది సేవలు అందించగలుగుతోంది. అల్ మక్తౌమ్ ఎయిర్ పోర్ట్, థర్డ్ క్వార్టర్లో 26 శాతం వృద్ధితో 119,000 మంది ప్రయాణీకులకు సేవలందించింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!