15 సెకెండ్స్‌లోనే యూఏఈ ఎంట్రీ పర్మిట్‌

- November 21, 2018 , by Maagulf
15 సెకెండ్స్‌లోనే యూఏఈ ఎంట్రీ పర్మిట్‌

యూ.ఏ.ఈ:ఆటోమేటెడ్‌ సిస్టమ్‌ ద్వారా కేవలం 15 సెకెండ్లలోనే ఎంట్రీ పర్మిట్స్‌ కోసం అప్లయ్‌ చేసుకునే అవకాశం కలుగుతుందని జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెసిడెన్సీ అండ్‌ ఫారినర్స్‌ ఎఫైర్స్‌ (జిడిఆర్‌ఎఫ్‌ఎ) వెల్లడించింది. కొత్త స్మార్ట్‌ సిస్టమ్‌ ద్వారా 5 మిలియన్‌ ట్రాన్సాక్షన్స్‌ రికార్డ్‌ టైమ్‌లో పూర్తి చేయగలదని అధికారులు వివరించారు. జిడిఆర్‌ఎఫ్‌ఎ డైరెక్టర్‌ జనరల్‌ మేజర్‌ జనరల్‌ మొహమ్మద్‌ అహ్మద్‌ అల్‌ మర్రి మాట్లాడుతూ, అప్లికెంట్స్‌ అథారిటీకి చెందిన స్మార్ట్‌ యాప్‌ లేదా వెబ్‌ సైట్‌ ద్వారా అప్లయ్‌ చేసుకోవచ్చు. ఈ సిస్టమ్‌ వెంటనే డాక్యుమెంట్స్‌ని స్కాన్‌ చేసి, అక్కడికక్కడే వీసాల్ని మంజూరు చేస్తుంది. ఏడాదిగా ఈ సిస్టమ్‌ని తాము పరీక్షిస్తున్నామనీ, పూర్తిస్థాయి యాక్యురసీతో ఈ సిస్టమ్‌ పనిచేసిందని అధికారులు వివరించారు. మెడికల్‌ సర్టిఫికెట్‌ బేస్డ్‌ రికార్డ్స్‌ని చెక్‌ చేయడానికి గతంలో 4 నుంచి 6 గంటల సమయం పట్టేదనీ, అది ఇప్పుడు కేవలం 15 సెకెండ్లలో పూర్తయిపోతుందని కల్నల్‌ డాక్టర్‌ ఒమర్‌ అలి సయీద్‌ అల్‌ షామ్సి చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com