విమానం ఢీకొని వ్యక్తి మృతి
- November 22, 2018
రష్యాలో విమానం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. విమానం గాల్లో ఎగురుతుంది కధా.. మనిషిని ఎలా ఢీకొంటుంది అనే డౌట్ రావొచ్చు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. రష్యాలోని మాస్కోలో బోయింగ్ 737 విమానం ఏథెన్స్‌కు వెళ్లేందుకు టేకాఫ్ అవుతుండగా అకస్మాత్తుగా ఓ వ్యక్తి రన్‌వేపైకి రావడంతో విమానం ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్నీ ఎయిర్పోర్టు పోలీసులు దృవీకరించారు. మరణించిన వ్యక్తిని ఆర్మేనియాకు చెందిన ఆల్బర్ట్ ఎప్రెమ్‌యాన్ (25)గా గుర్తించామని. స్పెయిన్ నుంచి వస్తున్న ఆయన మాస్కోలో విమానం మారి ఆర్మేనియాకు వెళ్లాలి. అయితే.. స్పెయిన్ నుంచి వస్తున్న సమయంలో విమానంలోని సిబ్బందిపై ఆ వ్యక్తి దాడి చేశాడు. దాంతో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అనంతరం ఆర్మేనియా విమానం ఎక్కించేందుకు తీసుకెళ్తుండగా.. ఉన్నట్టుండి రన్‌వేపైకి పరుగెత్తాడు. ఆ సమయంలో ఏథెన్స్‌కు వెళ్లే విమానం టేకాఫ్ అవుతూ ఆల్బర్ట్ ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడని ఎయిర్పోర్టు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







