ఆదివాసీ తెగవారికి మత బోధచేయాలని వెళ్లి అసువులు బాసిన క్రైస్తవ మతబోధకుడు
- November 22, 2018
అండమాన్‌లో రక్షిత ఆదిమ తెగ వారిని కలుసుకోవడానికి వెళ్లిన అమెరికన్ ఒకరు వారి చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. అండమాన్ దీవుల సమూహంలోని ఉత్తర సెంటినెల్ దీవిలో ఈ విషాదం చోటుచేసుకుంది. బయటివారిని బద్ధ శత్రువులుగా పరిగణించే ‘సెంటినెలీస్’ తెగ వారు ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ నెల 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అమెరికన్ అయిన జాన్ అలెన్ ఇంతకుముందు ఐదుసార్లు అండమాన్, నికోబార్ దీవులను సందర్శించారు. తాజా పర్యటనలో ఆయన సెంటినెలీస్ తెగ వారిని కలుసుకోవాలని అనుకున్నాడు. జాన్ క్రైస్తవ మతబోధకుడని, ఆ ఆదివాసీ తెగవారికి కూడా మత బోధన చేయాలన్నది ఆయన ఉద్దేశమని తెలుస్తోంది. అయితే సెంటినెలీస్ తెగవారు బయటివారితో సంబంధాలను ఏ మాత్రం సహించరు.
ఈ తెగవారిని కలిసేందుకు జాన్ ఈ నెల 14న ఒకసారి విఫలయత్నం చేశారు. 16న మరోసారి ప్రయత్నించారు. ఆ రోజున మత్స్యకారులకు రూ.25వేలు చెల్లించి, చిదియాతాపు ప్రాంతం నుంచి వారి పడవలో సెంటినెల్ దీవి సమీపం వరకూ వెళ్లారు. ప్రత్యక్ష సాక్షులైన మత్స్యకారుల కథనం ప్రకారం.. దీవిలో కాలు మోపగానే జాన్‌పై బాణాల వర్షం కురిసింది. అయినా జాన్ ముందుకు నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలి పోయాడు. ఆదిమ తెగ వారు ఆయన మెడకు తాడు కట్టి తీరం వద్దకు ఈడ్చుకెళ్లారు. ఆయన మృతదేహాన్ని సగం మేర ఇసుకలో పూడ్చిపెట్టారు.
మత్స్యకారులు పోర్ట్‌బ్లెయిర్‌కు తిరిగొచ్చాక ఈ ఘటనను జాన్ మిత్రుడైన స్థానిక మతబోధకుడు అలెక్స్‌కు తెలిపారు. దీంతో ఆయన అమెరికాలోని జాన్ కుటుంబానికి ఈ విషయాన్ని తెలియజేశారు. వారు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని అప్రమత్తం చేశారు.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు తీరరక్షక దళం, గిరిజన సంక్షేమ, అటవీ శాఖల సిబ్బందితో కూడిన బృందం ప్రయత్నాలు చేస్తోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







