బంగారం, వెండి ధరలు పెరిగాయి..
- December 22, 2015
మంగళవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. రూ.150 పెరగడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.25,750కి చేరింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారులు తాజాగా కొనుగోళ్లు చేపట్టడం తదితర కారణాల వల్ల దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1.13శాతం పెరిగి 1,078.20 అమెరికన్ డాలర్లకు చేరింది. ఈ రోజు వెండి ధర రూ.34,000 మార్కును చేరింది. రూ.250 పెరగడంతో కేజీ వెండి ధర రూ.34,000కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేయడంతో డిమాండు పెరిగిందని దీంతో ఈ లోహం ధర సైతం పెరిగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్సు వెండి ధర 1.7శాతం పెరిగి 14.25 అమెరికన్ డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









