ముఖ్యమైన యూఏఈ రోడ్‌ వీకెండ్‌లో పాక్షిక క్లోజర్‌

- November 22, 2018 , by Maagulf
ముఖ్యమైన యూఏఈ రోడ్‌ వీకెండ్‌లో పాక్షిక క్లోజర్‌

అబుదాబీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌ (డిఓటి), ముబారక్‌ బిన్‌ మొహమ్మద్‌ స్ట్రీట్‌ని నవంబర్‌ 22 నుంచి నవంబర్‌ 25 వరకు పాక్షికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. జనరల్‌ మెయిన్‌టెనెన్స్‌ నిమిత్తం ఈ మూసివేతను అమల్లోకి తీసుకొస్తున్నారు. నవంబర్‌ 22 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు, అలాగే ఉదయం నవంబర్‌ 23 శుక్రవారం రాత్రి 12 గంటల నుంచి నవంబర్‌ 25 ఉదయం 5 గంటల వరకు రోడ్డుని మూసివేస్తున్నారు. వాహనదారులు అప్రమత్తంగా వుండాలనీ, ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాలని అధికారులు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com