హత్య కేసులో నిందితురాలి వాదన ఇదే!
- November 23, 2018
అల్ అయిన్:అల్ అయిన్‌లో ఓ మహిళ, తన మాజీ లవర్‌ని హత్య చేసి, అతని శరీర భాగాల్ని ముక్కలుగా కోసి, వాటితో బిర్యానీ వండి.. తన ఇంటి పక్కనే ఓ భవన నిర్మాణం కోసం పనిచేస్తున్న కార్మికులకు వడ్డించిందంటూ ఓ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. అయితే, పోలీసులు 'వండి వడ్డించడం' అనే అంశానికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేవనీ, దీనిపై జరుగుతున్నదంతా దుష్ప్రచారమేనని, ఇలాంటి వార్తల్ని ప్రసారం చేయొద్దని అభ్యర్థిస్తున్నారు. మరో వైపున ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితురాలు, విచారణ సందర్భంగా తొలుత తన మాజీ బాయ్‌ఫ్రెండ్ తన మీద దాడికి దిగాడని నిందితురాలి తరఫు లాయర్ పేర్కొన్నారు. బాయ్‌ఫ్రెండ్ దాడి కారణంగా, ఆందోళన చెందిన ఆ మహిళ తనకు అందుబాటులో వున్న కత్తితో, బాయ్‌ఫ్రెండ్‌పై ఎదురుదాడి చేసిందనీ, దాంతో కుప్పకూలిన ఆ వ్యక్తిని చూసి షాక్‌కి గురైన ఆ మహిళ ఆ తర్వాత తేరుకుని, మృతదేహాన్ని ముక్కలుగా కోసిందని విచారణలో తేలింది. బాయ్‌ఫ్రెండ్‌తో జరిగిన గొడవ కారణంగానే ఈ హత్య చేసినట్లు నిందితురాలు ఒప్పుకుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







