క్రికెట్ మ్యాచ్‌లో గొడవ.. కాల్పుల్లో 7 మంది మృతి

- November 24, 2018 , by Maagulf
క్రికెట్ మ్యాచ్‌లో గొడవ.. కాల్పుల్లో 7 మంది మృతి

ఖైబర్: పాకిస్థాన్‌లో ఘోరం జరిగింది. క్రికెట్‌ మ్యాచ్ ఆడుతున్న సమయంలో చెలరేగిన గొడవ చివరకు తీవ్ర హింసగా మారింది. ఆ ఘటనలో రెండు వర్గాలకు చెందిన ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటన ఖైబర్ ఫక్తునక్వా ప్రావిన్సులో జరిగింది. అబోటాబాద్ జిల్లాలోని ఓ పోలీసు పోస్టు వద్ద రెండు వర్గాలు కాల్పులు జరుపుకున్నారు. క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న పిల్లల మధ్య ఘర్షణ మొదలైంది. అయితే ఆ గొడవ గురించి ఫిర్యాదు చేసేందుకు రెండు వర్గాలు ఓ పోలీసు పోస్టుకు చేరుకున్నాయి. అక్కడ రెండు వర్గాలకు చెందిన వారు ఆయుధాలతోనే పోలీసు స్టేషన్‌కు వచ్చారు. ఫిర్యాదు సమర్పిస్తున్న క్రమంలో ఆ గ్యాంగ్‌ల మధ్య మళ్లీ గొడవ రాజుకున్నది. దీంతో రెండు వర్గాలు కాల్పులు జరుపుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక వర్గానికి చెందిన ముగ్గురు, మరో వర్గానికి చెందిన నలుగురు మృతిచెందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com