కర్ణాటక:ఘోర బస్సు ప్రమాదం..20 మంది దుర్మరణం
- November 24, 2018
కర్ణాటకలోని మాండ్య జిల్లాలో బస్సు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కావేరి నది వీసీ కెనాల్లో బస్సు బోల్తా పడడంతో 20 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.మాండ్య నుంచి పాండవపుర వెళ్తున్న బస్సు కనగణమరడి గ్రామంలో అదుపుతప్పి కావేరీ నది కాలువలోకి దూసుకెళ్లినట్లుగా అధికారులు వెల్లడించారు. మృతి చెందినవారిలో పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉన్నారని తెలిపారు . బస్సులో సుమారుగా 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..