మాకు రాజకీయంగా నష్టం జరిగింది--సోనియా గాంధీ
- November 24, 2018
తెలంగాణ:నీళ్లు, నిధులు, నియామకాల అకాంక్షలతో ఏర్పడిన తెలంగాణలో ప్రజల జీవితాలను చూస్తుంటే భాదగా ఉందన్నారు యుపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ. మేడ్చల్ వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరించి సోనియా టీఆర్‌ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని అవేదన వ్యక్తం చేశారు.. రాష్ట్ర విభజన నిర్ణయం వల్ల తమకు రాజకీయంగా నష్టం జరిగినా… తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలనే తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. . ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చామని దానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
టీఆర్‌ఎస్ నాలుగున్నరేళ్ల పాలన అంతం కాబోతున్నదన్నారు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ. తెలంగాణ ఏర్పాటులో మీ పోరాటంతో పాటు సోనియా పాత్ర కూడా ఉందన్నారు. గత నాలుగున్నారేళ్లలో తనకు తోచిందే వేదంగా.. తన కుటుంబ లబ్ధి కోసమే పాలన సాగించారని రాహుల్ నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్ పాలన అంతంకోసమే కాంగ్రెస్,టీడీపీ, సీపీఐ, టీజేఎస్ జట్టుకట్టాయని స్పష్టం చేశారు. ప్రజా కూటమిలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రతిధ్వనిస్తున్నాయని అన్నారు రాహుల్ ..
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..