ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఫైన్

- November 24, 2018 , by Maagulf
ఆస్ట్రేలియా క్రికెట్  జట్టుకు ఫైన్

బ్రిస్బేన్‌: బ్రిస్బేన్‌లో తొలి టీ20లో టీమిండియాపై గెలుపొందిన ఆస్ట్రేలియా జట్టుకు షాక్. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా ఆస్ట్రేలియా జరిమానాకు గురైంది. టీమ్ కెప్టెన్ అరోన్ ఫించ్ మ్యాచ్ ఫీజులో 20శాతం, జట్టు సభ్యులకు 10శాతం కోత విధించారు. నిర్ణీత సమయంలో ఆసీస్ ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో ఈ నిర్ణయం తీసుకున్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆసీస్ 4 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో టీ20 వర్షం కారణంగా రద్దుకావడంతో సిరీస్ ఫలితం నిర్ణయించే మూడో టీ20 ఆదివారం సిడ్నీలో జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com