వరల్డ్ యాంటీ బయాటిక్ అవేర్‌నెస్ వీక్
- November 24, 2018
బహ్రెయిన్:యాంటీ బయాటిక్ రెసిస్టెంట్ మైక్రోబ్స్‌తో పోరాటం కోసం నేషనల్ స్ట్రేటజీని రూపొందించారు. సుప్రీం కౌన్సిల్ ఫర్ హెల్త్ (ఎస్‌సిహెచ్) ప్రెసిడెంట్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో యాంటీ బయాటిక్ విషయమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ మరియం అల్ జలాహ్మా, హెల్త్ మినిస్టర్ ఫయీకా అల్ సలెహ్, పలువురు అండర్ సెక్రెటరీస్, సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గల్ఫ్ హోటల్, అవాల్ బాల్‌రూమ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. వరల్డ్ యాంటీ బయాటిక్ అవేర్‌నెస్ వీక్‌లో భాగంగా ఈ గ్లోబల్ ఈవెంట్‌ని నిర్వహించారు. యాంటీబయాటిక్స్ వినియోగం తగ్గించడం ద్వారా, ముప్పుని కొంతవరకు అధిగమించవచ్చునని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మాత్రమే, యాంటీ బయాటిక్స్ వాడకం తగ్గించగలమని వక్తలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







