జ్యువలరీ అరేబియాలో అతి పెద్ద రింగ్‌ డిస్‌ప్లే

- November 24, 2018 , by Maagulf
జ్యువలరీ అరేబియాలో అతి పెద్ద రింగ్‌ డిస్‌ప్లే

సౌదీ అరేబియా:జ్యువలరీ  అరేబియాలో అరిహంత్‌ జ్యుయెలర్స్‌ ఇహెచ్‌ 170 బూత్‌ వద్ద భారీ రింగ్‌ కొలువు దీరింది. 21 క్యారెట్‌ నజ్మత్‌ తైబా, స్టార్‌ ఆఫ్‌ టైబగా పిలవబడే ఈ రింగ్‌ ఇప్పటికే గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కింది. వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ఈ రింగ్‌కి 3 మిలియన్‌ డాలర్ల ధరను నిర్ణయించింది. ఈ రింగ్‌ బరువు 64 కిలోగ్రాములు. ఇందులో 5.1 కిలోల బరువుగల విలువైన స్టోన్స్‌, డైమండ్స్‌ పొదగబడి వున్నాయి. అలాగే 615 స్వరోవ్‌స్కి క్రిస్టల్స్‌ని కూడా ఈ రింగ్‌లో పొదిగారు. 45 రోజుల్లో 450 గంటలపాటు 55 మంది జ్యుయెల్‌ స్మిత్స్‌ దీన్ని 2000 సంవత్సరంలో తయారు చేశారు. అప్పట్లో ఇందుకోసం 547,000 డాలర్లు ఖర్చు చేశారు. బహ్రెయిన్‌ వాసులు ఈ రింగ్‌ని చూసేందుకు పెద్దయెత్తున ఆసక్తి చూపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com