'పేటా' ఆడియో కు ముహూర్తం ఫిక్స్ !
- November 24, 2018
కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ 'పేట్టా' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రజనీ సరసన త్రిష జతకట్టనుంది. మరో కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ సిమ్రన్ నటిస్తున్నారు. ఇందులో విజయ్‌సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా 'పేట్టా'ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.
ఈ నేపథ్యంలో డిసెంబర్ నుంచి సినిమా ప్రమోషన్స్ ని మొదలెట్టారు. ఇందులో భాగంగా డిసెంబర్ 9న సినిమా ఆడియో వేడుకని ప్లాన్ చేశారు. అంతకంతే ముందే రెండు పాటలని విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 3 ఒకటి, డిసెంబర్ 7న మరో పాటని విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.
ఇక, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రజనీ 2.ఓ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విజువల్ వండర్ కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







