షాకింగ్ : అంబరీష్ ఇక లేరు
- November 25, 2018ముఖ సినీనటుడు, కాంగ్రెస్ నేత అంబరీష్ (66)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 1952 మే 29న అప్పటి మైసూర్ రాష్ట్రంలోని మాండ్యలో జన్మించారు. నాగరాహవు సినిమాతో 1972లో సినీరంగ ప్రవేశం చేశారు. శాండిల్‌వుడ్‌లో అనేక చిత్రాల్లో నటించిన అంబరీష్ కన్నడ రెబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. సినీనటి సుమలతను 1991లో వివాహం చేసుకున్నారు. సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అంబరీష్ అనంతరం రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్ తరఫున కర్ణాటక ఎన్నికల్లో మాండ్య అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2013లో సిద్దరామయ్య కేబినెట్లో ఆ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. అంబరీష్ భార్య సుమలత సినీనటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అంబరీష్ మృతిపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంబరీష్ మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కేంద్ర మాజీ మంత్రి సదానందగౌడ తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. అభిమానులు భారీగా తరలివస్తుండటంతో అంబరీష్ మృతి చెందిన ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు