అవ్వ కోరిక తీర్చిన ప్రిన్స్
- November 26, 2018
సూపర్ స్టార్ మహేష్ బాబు కు మన తెలుగు లోనే కాదు అన్ని భాషల్లోను అభిమానులు ఉన్నారు. కేవలం ఈ తరం వారికే కాదు ముందు తరం వారికీ కూడా ఎంత అభిమానమో ఈ 106 ఏళ్ల అవ్వ వల్ల అందరికి తెలిసింది. రాజమండ్రికి చెందిన 106 సంవత్సరాల వయసు కలిగిన రేలంగి సత్యవతి అనే ముసలి అవ్వకు మహేష్ అంటే ఎంతో అభిమానం. ఎలాగైనా మహేష్ ను కలవాలని.. మహేష్ తో ఫోటో దిగాలని ఆమె కల. ఈ విషయం తెలుసుకున్న మహేష్ అభిమానులు ఈ సంగతిని మహేష్ కు చేరవేశారు. వెంటనే మహేష్ స్పందించి అమెరికా నుండి ఇండియా రాగానే ఆమెను కలుస్తానని చెప్పాడట. ఇప్పుడు ఆయన చెప్పినట్లే ఆమెను కలిసి ఫోటో దిగాడు.
రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు ఆమెను పిలిపించాడు. మహేష్ ను చూసేందుకు ఆ బామ్మ ఎలాంటి భయం లేకుండా.. రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు చేరుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో మహేష్ బాబును కలిసింది. మహేష్ బాబుతో ఫోటో దిగింది. అనంతరం సెట్స్ లోనే మహేష్ తో కలిసి లంచ్ చేసిందట. ఈ విషయాన్నీ మహేష్ తన సోషల్ మీడియా పేజీ ద్వారా అభిమానులకు తెలియజేసాడు.
'ఏళ్లు గడుస్తున్నా నాపై ఉన్న ప్రేమ మరింత ఎక్కువవడం చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. అభిమానులు నాపై చూపించే ప్రేమ, అభిమానం నాకెప్పుడూ సంతోషాన్ని కలిగిస్తాయి. కానీ 106 ఏళ్ల ఈ బామ్మ నా కోసం రాజమహేంద్రవరం నుంచి వచ్చి నన్ను ఆశీర్వదించడం మరింత అనందాన్నిచ్చింది. ఆమె తన అభిమానంతో నా హృదయాన్ని గెలుచుకున్నారు. నిజాయతీగా చెప్పాలంటే ఆమె నన్ను కలిసినందుకు తనకంటే నేనే ఎక్కువ సంతోషంగా ఉన్నాను. దేవుడు ఈ అమ్మను చల్లగా చూడాలి. ఈ అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చాడు మహేష్. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా లో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
ప్రస్తుతం మహేష్ మహర్షి సినిమా చేస్తున్నాడు. వంశీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో జరుగుతుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







