ధనుష్ 'మారి 2'కి యు/ఎ సర్టిఫికెట్..

- November 26, 2018 , by Maagulf
ధనుష్ 'మారి 2'కి యు/ఎ సర్టిఫికెట్..

తమిళ యంగ్ హీరో ధనుష్, దర్శకుడు బాలాజీ మోహన్ క్యాంబినేషన్ లో 2015లో వచ్చిన 'మారి' మంచి విజయాన్ని సాధించింది. ఆ మూవీలో కాజల్ అగర్వాల్ కథానాయిక. అప్పట్లో ఈ మూవీ మాస్ ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. దాంతో అదే దర్శకుడితో ఈ సినిమాకి సీక్వెల్ గా 'మారి 2' రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ధనుశ్ జోడీగా సాయిపల్లవి కనిపించనుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, యు/ఎ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. థనుష్ స్వంత బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com