4 గంటలపాటు వర్షం: 147 ట్రాఫిక్ యాక్సిడెంట్స్
- November 26, 2018
దుబాయ్‌లో ఉదయం నాలుగు గంటల పాటు కురిసిన భారీ వర్షం కారణంగా మొత్తం 147 ట్రాఫిక్ యాక్సిడెంట్లు నమోదయ్యాయి. చాలా చోట్ల వీధుల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దుబాయ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ యూనిట్ 2566 ఎమర్జన్సీ కాల్స్‌ని రిసీవ్ చేసుకుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య ఈ కాల్స్ రిసీవ్ అయ్యాయి. దుబాయ్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ యాక్టింగ్ డైరెక్టర్ కల్నల్ మొహమ్మద్ అల్ ముహైరి మాట్లాడుతూ, వాహనాలు నడిపేవారు ముందు వెళ్ళే వాహనంతో తగినంత దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. పరిమిత వేగంతో మాత్రమే వాహనాలు నడపాలని ఆయన సూచించారు. ప్రయాణం కోసం అదనపు సమయాన్ని కేటాయించాలనీ, వెళ్ళే ప్రాంతంలో పరిస్థితుల్ని ముందుగా తెలుసుకుని వెళ్ళాలని సూచించారు. లో విజిబిలిటీ, బ్యాడ్ వెదర్ కండిషన్స్ నేపథ్యంలో ప్రమాదాలు జరిగినట్లు అల్ ముహైరి పేర్కొన్నారు. మరోపక్క దుబాయ్ పోలీస్ అదనంగా పెట్రోలింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. 24 గంటలూ అత్యవసర సేవలు అందించేందుకు తాము సిద్ధంగా వున్నట్లు దుబాయ్ పోలీస్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







