నేషనల్ డే: 205 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- November 26, 2018
రస్ అల్ ఖైమా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి, 205 ప్రిజనర్స్‌కి యూఏఈ 47వ నేషనల్ డే, కమ్మెమరేషన్ డే సందర్భంగా క్షమాభిక్ష ఇచ్చారు. పలు రకాల కేసులకు సంబంధించి శిక్ష ఎదుర్కొంటున్న ఖైదీలకు ఇది పెద్ద ఊరటగా పలువురు అభివర్ణిస్తున్నారు. గుడ్ కండక్ట్‌ని పరిగణనలోకి తీసుకుని ఆయా ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారు. క్షమాభిక్ష పొందినవారు తిరిగి సాధారణ జీవితం గడిపేందుకు అవకాశం లభిస్తుంది. ఆయా వ్యక్తుల కుటుంబాల్లో ఆనందోత్సాహాలు నింపుతుంది. ఈ సందర్భంగా షేక్ సౌద్‌కి రస్ అల్ ఖైమా అటార్నీ జనరల్‌కి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి, పలు సూచనలు చేశారు. క్షమాభిక్షకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో హసన్ సయీద్ ముహమ్మద్, షేక్ సౌద్‌కి కృతజ్ఞతలు తెలిపారు. క్షమాభిక్ష పొందినవారు, సమాజంలో మంచి పౌరులుగా మారాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







