ఇసుకలో కూరుకుపోయిన వాహనం: దొంగల పట్టివేత
- November 26, 2018
యూ.ఏ.ఈ:దొంగలు ప్రయాణిస్తున్న వాహనం ఇసుకలో కూరుకుపోవడంతో ఆ దొంగలు పట్టుబడ్డారు. షార్జా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ కంపెనీ నుంచి బిల్డింగ్ మెటీరియల్స్‌ని దొంగిలించిన నిందితులు, ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డుపై దాడి చేశారు. అనంతరం దొంగిలించిన మెటీరియల్‌తో వాహనంలో పారిపోతుండగా, వారి వాహనం ఇసుకలో ఇరుక్కుపోయింది. వాహనాన్ని ఇసుకలో వదిలేసి నిందితులు పారిపోయారు. మార్చి 21న ఈ దొంగతనం జరిగింది. దుండగుల దాడిలో గాయపడ్డ సెక్యూరిటీ గార్డ్‌ని ఆసుపత్రిలో విచారించిన పోలీసులు, అత్యంత చాకచక్యంగా నిందితుల్ని పట్టుకున్నారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. అయితే ఆదివారం జరిగిన హియరింగ్‌లో నిందితులపై అభియోగాలు నిరూపించబడలేదు. కేసు తదుపరి విచారణను డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







