మార్స్‌పై దిగిన ఇన్‌సైట్ .. నాసాలో సంబరాలు
- November 27, 2018_1543294676.jpg)
హూస్టన్: అరుణ గ్రహంపై ఇన్‌సైట్ ల్యాండర్ సక్సెస్‌ఫుల్‌గా దిగింది. దీంతో నాసా సైంటిస్టులు సంబరాల్లో తేలిపోయారు. మార్స్ గ్రహాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇన్‌సైట్ ల్యాండర్‌ను ప్రయోగించింది. ల్యాండింగ్ సమయంలో చివరి ఏడు నిమిషాలు ఉత్కంఠంగా సాగాయి. రెడ్ ప్లానెట్ నేలపై ల్యాండర్ వాలడంతో.. ఇక నాసా బృందంలో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. మార్స్ గ్రహ పరిస్థితులను ఇన్‌సైట్ ల్యాండర్ సంపూర్ణంగా స్టడీ చేయనున్నది. భూమిని పరిశీలించినంత లోతుగా.. అరుణ గ్రహాన్ని కూడా అధ్యయనం చేస్తామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మార్స్‌పై దిగిన వెంటనే.. ఇన్‌సైట్ ల్యాండర్ ఫోటోలను పంపించింది. అరుణ గ్రహ ఉపరితలంపై రాళ్లు ఉన్నట్లు ఆ ఫోటోల్లో స్పష్టమైంది. కాలిఫోర్నియాలోని జెట్ ప్రొపల్షన్ ల్యాబరేటరీ నుంచి ఇన్‌సైట్‌ను ఆపరేట్ చేస్తున్నారు. ఇన్‌సైట్ విజయవంతంగా ల్యాండ్ కావడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. మార్స్ గ్రహంపై ఈక్వేటర్ సమీపంలో ఉన్న ఎసిషియం ప్లానేషియా ప్రాంతంలో ఇన్‌సైట్ దిగినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. అరుణ గ్రహంపై ఇదో పెద్ద పార్కింగ్ ఏరియా అని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు.
2012లో జరిగిన క్యూరియాసిటీ రోవర్ ల్యాండింగ్ తర్వాత మళ్లీ మార్స్ గ్రహంపై ఇన్‌సైట్ దిగడం విశేషం. ఆ గ్రహంపై ఉన్న అన్ని కోణాల్లో ఇన్‌సైట్ రోబో ఫోటోలను రిలీజ్ చేస్తోంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!