26/11 ముంబై ఎటాక్‌: ఒమన్‌లో అమరులకు నివాళి

- November 27, 2018 , by Maagulf
26/11 ముంబై ఎటాక్‌: ఒమన్‌లో అమరులకు నివాళి

మస్కట్‌: 2008 నవంబర్‌ 28న భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో తీవ్రవాదుల దాడి కారణంగా ప్రాణాలు కోల్పోయినవారికి మస్కట్‌లో నివాళులర్పించారు ఇక్కడ సెటిలైన ముంబైకి చెందినవారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినవారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనాటి ఆ ఘటనలో 174 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయాలపాలయ్యారు. 10 మంది తీవ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. 9 మంది తీవ్రవాదుల్ని పోలీసులు మట్టుబెట్టగా, సజీవంగా పోలీసులకు చిక్కిన కసబ్‌పై నేరాభియోగాలు నిరూపించి, చట్ట ప్రకారం ఉరితీశారు. ఆనాటి ఆ ఘటనను తలచుకుంటూ, ఆ ఘటనలో తమవారిని కోల్పోయిన బాధితులు ఇప్పటికీ కన్నీరు మున్నీరవుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com